చిన్న కుటుంబం ...చింతలేని కుటుంబం
చిన్నమొత్తాల పొదుపు...బంగరు భవితకు మలుపు

చిన్నప్పట్సంది గోడల మీద ఊర్కె ఇదే గనిపిచ్చేది. మరి ఇప్పుడు ఇడిపోదం అని అంటుంటే సీమాంధ్ర నేతలు ఇతండవాదం చేస్తున్నరు. పెద్దగుంటెనే..కల్సి ఉంటెనే మన ప్రయోజనాలు (ఆళ్ల యాపారాలు..దోచుకు తినుకాలు) నెరవేరుతాయని చెప్తుండ్రు. అందుకే నా ఆలోచన వచ్చింది.
...
కలిసుండి కొట్లాడుడు కంటే..ఇడి పోయి మంచి గుండుడు మేలు అన్నది పెద్దల మాట
అట్లని ఇడిపోయినం అని సీమాంధ్ర నేతలకు గుడ్క బాధ లేకుంట ఓ పని జేస్తె బాగుంటదని నా ఆలోచన

పది జిల్లాల తెలంగాణను ఇస్తే 13 జిల్లాలు మిగులుతయి
అప్పుడు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలను కర్ణాటకల కలపాలె
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను తమిళనాడుల కలపాలె
మిగిలిన ఏడు జిల్లాలు గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒరిస్సాల కలపాలె

అప్పుడు సీమాంధ్ర నేతలు అడుగుతున్నట్లు పెద్ద రాష్ట్రానికి పెద్ద రాష్ట్రం ఉంటది..
చంద్రబాబుకు, జగన్ కు, కిరణ్ కు కుదార్థంగ ఉంటది.. పెద్ద రాష్ట్రం కావట్క పెద్ద పెద్ద పనులు చేయొచ్చు
ఆ రాష్ట్రాలకు ఈళ్లు ముక్యమంత్రులై ఏలోచ్చు

ఎట్లున్నది నా ఆలోచన ..ఏమన్న తప్పు జెప్పినానె..